![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -454 లో.. వల్లి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి ప్రేమ, నర్మద ఇద్దరు వచ్చి తనకి కంగ్రాట్స్ చెప్తారు. చందు మాత్రం కోపంగా ఉంటాడు. బా ఇప్పుడు మనం తల్లిదండ్రలం కాబోతున్నామని వల్లి అంటుంది. నువ్వు చేసిన మోసం నేను మర్చిపోలేను.. ఈ విషయం వెంటనే నాన్న వాళ్ళకి చెప్పాలని చందు కోపంగా ఇంటికి వెళ్తాడు. నాన్న అని చందు పిలుస్తాడు. నాకు తెలుసురా నువ్వు ఏం చెప్పాలని వస్తున్నావో వల్లి ప్రెగ్నెంట్ కదా.. ఈ విషయం నిజంగా సంతోషకరమైన విషయమేనని రామరాజు అంటాడు. అది కాదు నాన్న.. నీకు వాళ్ళ గురించి తెలియదని చందు చెప్పాలని ట్రై చేస్తుంటే ధీరజ్ వాళ్ళు వద్దని సైగ చేస్తారు.
అయినా చెప్పాలని ట్రై చేస్తాడు.. అప్పుడే వల్లిని తీసుకొని వేదవతి ఎంట్రీ ఇస్తుంది. దాంతో అందరు ఆశ్చర్యంగా చూస్తారు. వాడేం చెప్పాలని అనుకుంటున్నాడో నాకు తెలుసు వల్లిని అమ్మ తీసుకొని రావాలని చెప్పబోతున్నాడని వేదవతి అనగానే అవునా అని రామరాజు అంటాడు. కాదండి.. వల్లి వాళ్ళు మోసం చేశారని చెప్పాలని అనుకుంటున్నాడని వేదవతి అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. మరి ఏంటండి అన్ని వాడు ఏం చెప్పాలని అనుకుంటాడని వేదవతి నవ్వుతుంది. ప్రేమ, నర్మద ఇద్దరు వల్లికి హారతి ఇచ్చి ఆహ్వానిస్తారు.
ఆ తర్వాత ప్రేమ, నర్మద దగ్గరికి భాగ్యం వచ్చి.. నా కూతురిని ఈ ఇంట్లో అడుగుపెట్టనివ్వమని ఎవ్వరో అన్నారు కదా.. ఇప్పుడు ఏమైందని అంటుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. ఓ అత్త ఎక్స్ ట్రాలు మాట్లాడితే కత్తిరించేస్తానని అంటాడు. అలా ధీరజ్ అనగానే వాళ్ళు ముగ్గురున్నారు పదవే అని భాగ్యాన్ని ఆనందరావు తీసుకొని వెళ్తాడు. అసలు అత్త సడెన్ గా ఎంట్రీ ఎందుకు ఇచ్చిందని ధీరజ్ ని ప్రేమ, నర్మద అడుగుతారు. అమ్మ వస్తున్నట్లు ముందే తెలుసు కానీ వదినని తీసుకొని రావడం మొత్తం వదిన ప్లాన్ అని ధీరజ్ అంటాడు. వేదవతికి జరిగింది చెప్పి వల్లిని తీసుకొని రమ్మని చెప్పినట్టు నర్మద చెప్తుంది. అక్క నువ్వు గ్రేట్ అందరి గురించి ఆలోచిస్తావని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |